తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఆ జట్టు స్టార్​ పేసర్​ ఇంట్లో విషాదం - బెంగళూరు

Harshal patel sister: ఐపీఎల్​ 2022 సీజన్​ ఉత్కంఠగా సాగుతోంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లు బయో బబుల్​లో ఉంటున్నారు. ఆర్సీబీ పేసర్​ హర్షల్​ పటేల్​ ఇంట్లో విషాదం చోటు చేసుకోగా.. అతడు బయో బబుల్​ వీడినట్లు ఐపీఎల్​ వర్గాలు తెలిపాయి.

IPL 2022
ఆ జట్టు స్టార్​ పేసర్​ ఇంట్లో విషాదం

By

Published : Apr 10, 2022, 12:32 PM IST

Updated : Apr 10, 2022, 2:09 PM IST

Harshal patel sister: రాయల్​ ఛాలేంజర్స్​ బెంగళూరు పేసర్​ హర్షల్​ పటేల్​ ఇంట్లో విషాదం జరిగింది. కుటుంబంలోని ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలిసిన క్రమంలో ఐపీఎల్​ బయో బబుల్​ వీడాడు హర్షల్​. ముంబయి ఇండియన్స్​తో శనివారం మ్యాచ్​ అనంతరం హర్షల్​ పటేల్​ సోదరి మృతి చెందినట్లు తెలుసిందని ఐపీఎల్​ వర్గాలు తెలిపాయి. ఆర్సీబీ తదుపరి మ్యాచ్​కు ముందే తిరిగి బయో బబుల్​లో చేరతాడని ఆశాభావం వ్యక్తం చేశాయి.

హర్షల్​ పటేల్​

" దురదృష్టవశాత్తు.. కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందిన క్రమంలో హర్షల్​ బయో బబుల్​ను వీడాడు. మృతి చెందిన వ్యక్తి అతడి సోదరి. విషయం తెలిసిన క్రమంలో మ్యాచ్​ అనంతరం పుణె నుంచి ముంబయి చేరుకునేందుకు టీమ్​ బస్సులో రాలేదు. ఏప్రిల్​ 12న సీఎస్​కేతో మ్యాచ్​కు ముందే తిరిగి బయో బబుల్​లో చేరతాడు. "

- ఐపీఎల్​ వర్గాలు

బెంగళూరు జట్టులో హర్షల్ పటేల్​ కీలక బౌలర్​గా మారాడు. కొన్ని సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయిపై రెండు వికెట్లు పడగొట్టి దెబ్బ తీశాడు. గత ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన హర్షల్​.. ఇప్పటి వరకు 8 మ్యాచ్​లు ఆడాడు.

ఇదీ చూడండి:ఆ నాలుగు దేశాలతో ప్రత్యేక టోర్నీ.. బీసీసీఐ​ ఏమందంటే?

Last Updated : Apr 10, 2022, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details