దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ తమ ఉదారతను చాటుకుంది. కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటిస్తున్నట్లు గురువారం ఆ టీమ్ యాజమాన్యం వెల్లడించింది.
రాజస్థాన్ రాయల్స్ ఉదారత.. కరోనా బాధితులకు విరాళం
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్.. తమ ఉదారతను చాటుకుంది. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న వేళ వైరస్ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటించింది.
కరోనా బాధితుల కోసం రాజస్థాన్ రాయల్స్ విరాళం
ఐపీఎల్లో ఇప్పటికే కోల్‌కతా బౌలర్ పాట్ కమిన్స్ 50 వేల డాలర్ల సాయం చేయగా.. ఆ తర్వాత సన్‌రైజర్స్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి ముందుకొచ్చాడు. దేశంలో ఆక్సిజన్ సరఫరా కోసం తన వంతు సాయంగా రూ.90వేలు విరాళమిచ్చాడు. వీరితో పాటు క్రికెటర్లు బ్రెట్‌లీ, షెల్డన్ జాక్సన్‌లు సాయమందించి తమ గొప్ప మనసుకు చాటుకున్నారు.
ఇదీ చూడండి..రాణించిన బట్లర్, శాంసన్.. ముంబయి లక్ష్యం 172