తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచిన పంజాబ్.. ముంబయి బ్యాటింగ్ - k l rahul

చెన్నైలోని చెపాక్​ వేదికగా ముంబయి-పంజాబ్​ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పంజాబ్ బౌలింగ్​ ఎంచుకుంది.

rohit sharma, k l rahul
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్

By

Published : Apr 23, 2021, 7:02 PM IST

Updated : Apr 23, 2021, 7:09 PM IST

ఐపీఎల్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా నేడు జరగబోతున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్ జట్టు​తో ముంబయి ఇండియన్స్​ తలపడనుంది. వరుసగా మూడు పరాజయాలతో పంజాబ్ ఉండగా​.. టోర్నీలో నిలకడ కోసం ముంబయి ఇండియన్స్​ ప్రయత్నిస్తుంది. ఇప్పటివరకు టోర్నీలో నాలుగు మ్యాచ్​లు ఆడిన రోహిత్​ సేన రెండు విజయాలను నమోదు చేసుకుంది. పంజాబ్​.. ఒకే గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరుకుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్​లో పాత జట్టుతోనే ముంబయి బరిలో దిగుతుండగా.. పంజాబ్ ఒక మార్పు చేసింది.

ముంబయి ఇండియన్స్

రోహిత్ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, బుమ్రా, బౌల్ట్

పంజాబ్ కింగ్స్

రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హెన్రిక్స్, షారుఖ్ ఖాన్, ఫాబియాన్ అలెన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

ఇదీ చదవండి:'కొవిడ్ వారియర్స్​ రండి.. ప్లాస్మా దానం చేయండి'

ఇదీ చదవండి:ఫుట్​బాల్​ కోచ్​కు ఆర్సీబీ జెర్సీ పంపిన కోహ్లీ

Last Updated : Apr 23, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details