టెస్టుల్లో అదరగొట్టేస్తున్న టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గత కొంతకాలంగా వన్డేలు, టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు. దూకుడుగా ఆడాల్సిన సమయంలోనూ విఫలమై విమర్శపాలవుతున్నాడు. అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం తడబాటుకు గురవుతున్నాడు. పంత్‌ను పక్కన పెట్టేసి సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌కు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. తొలి వన్డేలో శాంసన్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమర్ డౌల్ కూడా ఇలానే స్పందించాడు. పంత్ కంటే సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వాలని సూచించాడు.
'పంత్ కంటే అతడే బెటర్'.. కివీస్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
రిషభ్ పంత్ టీ20, వన్డేల్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేక విమర్శలపాలవుతున్నాడు. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారనే ప్రశ్నలూ తలెత్తాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమర్ డౌల్ కూడా ఇలానే స్పందించాడు.
"గత కొన్ని రోజులుగా రిషభ్ పంత్ రికార్డును పరిశీలిస్తే చాలా దారుణంగా ఉంది. దాదాపు 30 మ్యాచ్‌లు ఆడితే స్ట్రైక్‌రేట్ ఫర్వాలేదనిపించినా సగటు 35 మాత్రమే. అదే సంజూ శాంసన్ కేవలం 11 మ్యాచుల్లోనే 60 సగటుతో పరుగులు చేశాడు. అందుకే సంజూకే అవకాశాలు ఇవ్వాలని చెబుతా. తుదిజట్టులో పంత్-సంజూ ఎవరుండాలనే చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. రిషభ్ పంత్ గురించి చాలా చెప్పొచ్చు. టెస్టుల్లో రాణించే పంత్ తెల్లబంతి ఫార్మాట్‌లో (వన్డేలు, టీ20లు) మాత్రం ఉత్తమ కీపర్ - బ్యాటర్ మాత్రం కాదు" అని డౌల్ స్పష్టం చేశాడు.
TAGGED:
pant