పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగిన పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ సీజన్లో మూడోసారి సున్నా పరుగులకే ఔటై తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఐపీఎల్లో నికోలస్ పూరన్ చెత్త రికార్డు
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు పూరన్.
ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక బంతికి, రెండు బంతులకు, మూడు బంతులకు డకౌట్‌గా వెనుదిరిగిన మొదట ఆటగాడిగా చెత్త రికార్డు సృష్టించాడు పూరన్. ఈ సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన పూరన్ మూడో మ్యాచ్‌లో మాత్రం 9 పరుగులు చేశాడు. మళ్లీ ఈరోజు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 120 పరుగులే చేయగలిగింది. మయాంక్ (22), షారుఖ్ ఖాన్ (22) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది సన్‌రైజర్స్. బెయిర్‌స్టో (63) అర్ధశతకంతో రాణించగా వార్నర్ (37) ఆకట్టుకున్నాడు.