ఐపీఎల్ 2021(IPL 2021 News)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవడమే లక్ష్యంగా ఆడుతున్న ముంబయి ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్(mi vs dc 2021) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కాగా ముంబయి కనుక ఇందులో ఓడితే టాప్-4 రేసులో మరింత వెనకపడుతుంది. దీంతో ఇరుజట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్ నేడు (అక్టోబర్ 2) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం.
దిల్లీ జోరు కొనసాగేనా!
ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్లీ(delhi capitals team)కి షాకిచ్చింది కోల్‌కతా నైట్‌రైడర్స్(kkr vs dc 2021). దీంతో ఈ జట్టు తమ బలహీనతల్ని గుర్తించి ఈ మ్యాచ్‌లో గెలవడమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయలగలిగింది. స్మిత్ (39), పంత్ (39) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. గత మ్యాచ్‌లో ఆడని ఓపెనర్ పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ స్టోయినిస్‌కు కూడా చోటు దక్కే వీలుంది. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు రవి అశ్విన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ సత్తాచాటాలని యాజమాన్యం భావిస్తోంది.
ముంబయికి కీలకం
వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021) గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(mi vs pbks 2021)పై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ జట్టు టాప్-4లో నిలవాలంటే వీరికి ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచిస్తోంది ఫ్రాంచైజీ. ఈ సీజన్లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోందీ జట్టు. గత సీజన్లో మెరుపులు మెరిపించిన సూర్య కుమార్ ఈ సీజన్లో తేలిపోయాడు. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, డికాక్ పర్వాలేదనిపిస్తున్నా జట్టుకు భారీ పునాది మాత్రం వేయలేకపోతున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న సౌరభ్ తివారి (45), హార్దిక్ పాండ్యా (40) ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. పొలార్డ్ ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా రాణిస్తున్నా.. స్పిన్ యూనిట్ మాత్రం విఫలమవుతోంది. షార్జా పిచ్ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.