తెలంగాణ

telangana

By

Published : May 12, 2021, 4:03 PM IST

Updated : May 12, 2021, 4:45 PM IST

ETV Bharat / sports

చాలా బాధేసింది.. మరీ అంత ఘోరమా?: కుల్దీప్​

ఐపీఎల్​లో ఈసారి తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధేసిందని కోల్​కతా​ బౌలర్​ కుల్దీప్​ చెప్పాడు​. అలానే ధోనీ మార్గనిర్దేశాన్ని మిస్సవుతున్నట్లు చెప్పాడు.

kuldeep
కుల్దీప్​

ఐపీఎల్‌లో ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక్కసారైనా తనకు అవకాశం ఇవ్వకపోవడంపై చైనామన్‌ బౌలర్ కుల్దీప్​ యాదవ్‌ నిరాశ వ్యక్తం చేశాడు. 'నేను మరీ అంత ఘోరమా?' అని బాధపడ్డానని అన్నాడు. వికెట్ల వెనకాల ధోనీ అనుభవాన్ని తాను మిస్సవుతున్నానని పేర్కొన్నాడు. పంత్‌కు మరింత అనుభవం వస్తే సలహాలు ఇస్తాడని వెల్లడించాడు.

"నా ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో నాకు చోటు లేకపోవడం నన్ను మరింత కలచివేసింది. నేనంత ఘోరంగా ఆడుతున్నానా అని ఆశ్చర్యపోయాను. ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం. వారి వద్దకు వెళ్లి అడగడం తప్పు. చెన్నై పిచ్‌ టర్న్‌కు అనుకూలిస్తుంది. అక్కడా నాకు చోటు దక్కకపోవడం వల్ల షాకయ్యాను. కానీ చేసేదేం లేదు. కొన్నిసార్లు నేను మహీభాయ్‌ మార్గనిర్దేశాన్ని మిస్సవుతాను. ఆయనది గొప్ప అనుభవం. వికెట్ల వెనకాల ఉండి మాకెప్పుడూ సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు రిషభ్ ఉన్నాడు. అతడు మరిన్ని మ్యాచులు ఆడితే భవిష్యత్తులో సలహాలు ఇవ్వగలడు. ప్రతి బౌలర్‌కు అవతలి ఎండ్‌లో భాగస్వామి ఉండాలని నా నమ్మకం. ధోనీ భాయ్ వీడ్కోలు పలికాక నేను, చాహల్‌ కలిసి ఆడలేదు. మొత్తంగా నా ప్రదర్శన చూస్తే ఫర్వాలేదు. కొన్నిసార్లు మాత్రం స్థాయికి తగ్గట్టు ఉండదు. మేం ఆడేటప్పుడు ప్రత్యర్థినీ చూడాలి"

-కుల్దీప్​, టీమ్​ఇండియా స్పిన్నర్​​.

కొన్ని నెలలుగా కుల్దీప్​ యాదవ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం లేదు. ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఎంఎస్‌ ధోనీ రిటైర్‌ అవ్వకముందు కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ మణికట్టు మాంత్రిక ద్వయంగా ప్రశంసలు అందుకున్నారు. కానీ వారిద్దరూ కలిసి ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇటీవల ఎంపిక చేసిన ఇంగ్లాండ్‌ సిరీసుకు అతడిని పూర్తిగా పక్కన పెట్టారు.

కుల్దీప్​

ఇదీ చూడండి: కుల్దీప్​కు మరోసారి అన్యాయం.. అభిమానుల ఆగ్రహం!

Last Updated : May 12, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details