తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతాxరాజస్థాన్​: గెలుపు బాట పట్టేదెవరు? - kolkata knight riders

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా కోల్​కతా నైట్​ రైడర్స్​, రాజస్థాన్​ రాయల్స్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ముంబయి వాంఖడే వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

sanju samson, ian morgan
సంజూ శాంసన్, ఇయాన్ మోర్గాన్

By

Published : Apr 24, 2021, 5:32 AM IST

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు కోల్​కతా నైట్ రైడర్స్​, రాజస్థాన్ రాయల్స్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ ఆసక్తికర పోరుకు వాంఖడే వేదిక కానుంది. ఇప్పటికే చెరో నాలుగు మ్యాచ్​లు ఆడిన ఇరుజట్లు మూడు ఓటములను మూటగట్టుకున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో శాంసన్ సేన చివరి స్థానంలో ఉండగా.. మోర్గాన్ సేన చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.

కోల్​కతా గెలుపు బాట పట్టేనా..

చివరగా చెన్నైతో జరిగిన మ్యాచ్​లో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన కోల్​కతా.. విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. టాపార్డర్​ విఫలమైనప్పటికీ మిడిలార్డర్​ ఫర్వాలేదనిపించింది. ఓపెనర్లు గిల్​-రానాతో పాటు కెప్టెన్ మోర్గాన్ రాణిస్తే బ్యాటింగ్​కు తిరుగుండదు.

ఇక బౌలింగ్​లో వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్​ ఫర్వాలేదనిపిస్తున్నారు. ప్రసిధ్ కృష్ణ, కమిన్స్​ స్థిరంగా రాణించకపోగా.. భారీగా పరుగులు ఇస్తున్నారు. దీంతో ప్రత్యర్థి జట్లు పరుగుల పండగ చేసుకుంటున్నాయి. వీరితో పాటు షకిబుల్​ హసన్​ ఆల్​రౌండ్ ప్రదర్శన చేయాలని కేకేఆర్​ కోరుకుంటోంది.

ఇదీ చదవండి:తడబడిన ముంబయి.. పంజాబ్ లక్ష్యం 132

రాజస్థాన్​ అంచనాలు అందుకునేనా..

చివరగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ప్రధాన బ్యాట్స్​మెన్​ విఫలమైనప్పటికీ.. మంచి స్కోరు సాధించింది రాజస్థాన్​ జట్టు. కానీ, బెంగళూరు బ్యాట్స్​మెన్​ ఆర్ఆర్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించారు. గత మ్యాచ్​లో శివమ్​ దూబే, తెవాతియా, పరాగ్​ రాణించడం చెప్పుకోదగ్గ అంశం. జాస్​ బట్లర్​, వోహ్రా, మిల్లర్​ ఆకట్టుకోలేకపోతున్నారు. తొలి మ్యాచ్​లో సంజూ సెంచరీతో అదరగొట్టినా.. తర్వాత ఆ స్థాయిలో ఆడలేదు.

ఇక బౌలింగ్​లో సకారియా, క్రిస్ మోరిస్​, ముస్తాఫిజుర్ రెహ్మన్ రాణిస్తున్నా.. గోపాల్​, తెవాతియా, పరాగ్​ ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ స్పిన్నర్లు రాణిస్తే రాజస్థాన్​కు ఎదురుండదు.

ఇదీ చదవండి:జింబాబ్వే చేతిలో ఖంగుతిన్న పాకిస్థాన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details