ముంబయిలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేయనుంది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. గతేడాది ఐపీఎల్లో కనిపించని సురేశ్ రైనా, చాలారోజుల తర్వాత ధోనీ.. తిరిగి మైదానంలోకి వస్తుండటం వల్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దిల్లీ క్యాపిటల్స్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ మెట్టుపై బోల్తాపడిన దిల్లీ.. పంత్ సారథ్యంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి?