ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్ హోదాలో రిషభ్ పంత్ చిరస్మరణీయ విజయం సాధించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో ధావన్, పృథ్వీషా అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా 189 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది పంత్ సేన.
కెప్టెన్‌గా పంత్ తొలి విక్టరీ.. చెన్నైపై దిల్లీ గెలుపు - ipl
ముంబయి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. ధావన్, పృథ్వీషా హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా 189 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది పంత్ సేన.
ఛేదనలో దిల్లీ ఓపెనర్లు ధావన్-పృథ్వీషా అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు అభేద్యంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షా ఔటయ్యాడు. ఆ తర్వాత దావన్ 85 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగతా లాంఛనాన్ని స్టోయినిస్, కెప్టెన్ పంత్ పూర్తి పూర్తి చేశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తడబడతూ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 7 పరుగుల వద్ద రెండు వికెట్లు పోగొట్టుకుంది. ఆ తర్వాత రైనా(54) అర్ధ శతకంతో ఆకట్టుకోగా, మొయిన్ అలీ 36, రాయుడు 23, జడేజా 26, సామ్ కరన్ 34 పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, వోక్స్ తలో రెండు వికెట్లు తీయగా, అశ్విన్, టామ్ కరన్ ఒక్కో వికెటు పడగొట్టారు.