IPL 2022 Bhuvaneshwar Kumar: ఐపీఎల్ 15వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సన్‌రైజర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే వికెట్ తీసిన భువనేశ్వర్.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డుతో ఉన్న సందీప్ శర్మ, జహీర్ ఖాన్‌ను భువనేశ్వర్ కుమార్ అధిగమించాడు.
పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ సాధించాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఔట్ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో ఇప్పటివరకు 54 వికెట్లు తీసిన భువనేశ్వర్ 138 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు.