తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 RCB VS PBKS : సిరాజ్​ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్​.. రొనాల్డోలా సెలబ్రేషన్స్!​ - siraj runout punjab batter

ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ పేసర్​ సిరాజ్ తన బౌలింగ్​తో మ్యాచ్​కే హైలైట్​గా నిలిచాడు. ఐపీఎల్​ కెరీర్​లో ఇవి అతడికి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్​ అని చెప్పొచ్చు. ఆ వివరాలు..

Siraj
సిరాజ్​ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్​.. రొనాల్డోలా సెలబ్రేషన్స్!​

By

Published : Apr 20, 2023, 9:45 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 16వ సీజన్‌లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్​లో 24 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్​లో కోహ్లీ, డుప్లెసిస్​, బౌలింగ్​లో హైదరాబాదీ పేసర్​ సిరాజ్​ అద్భుత ప్రదర్శనతో ఈ విజయం దక్కింది. ముఖ్యంగా సిరాజ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టేశాడు.​ అలా అతడు పంజాబ్​ను చిత్తు చేయడం మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది. అయితే అతడు తీసిన వికెట్లతో హర్​ప్రీత్​ సింగ్​ బాటియాను డైరెక్ట్​ హిట్​తో రనౌట్​ చేయడం మ్యాచ్​కు స్పెషల్​గా నిలిచిందనే చెప్పాలి. అంటే ఒక రకంగా సిరాజ్‌ ఐదు వికెట్ల ఫీట్‌(నాలుగు వికెట్లు+ రనౌట్‌) తన ఖాతాలో వేసుకున్నట్టే. ఐపీఎల్‌లో అతడికి ఇది బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌ అని చెప్పొచ్చు.

ఎలా తీశాడంటే.. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్​లో విజయ్‌కుమార్‌ వేసిన మూడో బాల్​ను ప్రభ్​సిమ్రన్‌ సింగ్‌ మిడాఫ్‌ దిశగా బాదాడు. వెంటనే సింగిల్‌ తీసే ప్రయత్నం చేసిన అతడు.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్​లో ఉన్న హర్‌ప్రీత్‌ బాటియాకు కాల్‌ ఇచ్చాడు. ఇక ప్రభ్​సిమ్రన్‌ పిలుపుతో హర్‌ప్రీత్‌ పరిగెత్తాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్‌ డైరెక్ట్‌ త్రో విసిరాడు. అలా హర్‌ప్రీత్‌ క్రీజులోకి వచ్చేలోపే బాల్​ వికెట్లను గిరాటేసింది. దీంతో అతడు రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే డైరెక్ట్‌ త్రోతో అదిరిపోయే రనౌట్‌ చేసిన సిరాజ్‌.. స్టార్ ఫుట్​బాల్​ రొనాల్డోలా 'Siuuu' సెలబ్రేషన్‌ చేసుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం సిరాజ్‌ తన ప్రదర్శనపై మాట్లాడాడు. "మ్యాచ్‌లో ఫస్ట్ బాల్​ షార్ట్‌ లెంగ్త్‌ వేశాను.. కానీ ఆ తర్వాత నుంచి స్వింగ్‌పై ఫోకస్​ పెట్టి వికెట్‌ తీయాలని అనుకున్నాను. అలానే అది సక్సెస్​ అయింది. లాక్‌డౌన్‌ నాలో చాలా మార్పును తీసుకొచ్చింది. అంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీసినప్పటికీ బౌండరీలు సమర్పించుకునేవాడిని. దీంతో ప్రతిఒక్కరు నన్ను టార్గెట్‌ చేశారు. అందుకే దీనిని మార్చాలనుకున​న్నా. అందుకోసం నా ప్రణాళిక, ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నను. ఇకపోతే మైదానంలో నేను డీసెంట్‌ ఫీల్డర్‌నే. మిస్‌ఫీల్డ్‌ చేయడం సహజం. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌ను సీరియస్‌గా తీసుకుని ఆడుతా" అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్​లో 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. 18.2 ఓవర్లలో 150 పరుగుల చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (46; 30 బంతుల్లో 3x4, 4x6), జితేశ్ శర్మ (41; 27 బంతుల్లో 2x4, 3x6) స్కోరు చేసినా ఫలితం దక్కలేదు. సిరాజ్​ బౌలింగ్​తో చిత్తైపోయింది. ఫలితంగా ఆర్సీబీ 24 రన్స్ తేడాతో విజయం సాధించింది.

ఇదీ చూడండి:IPL 2023 RCB VS PBKS : పంజాబ్​ను చిత్తు చేసిన సిరాజ్​.. ఆర్సీబీ విజయం

ABOUT THE AUTHOR

...view details