ఇది కదా అసలైన ఐపీఎల్ మజా అంటే. బంతి బంతికి తీవ్ర ఉత్కంఠ. గెలుపు ఎవరిని వైపు నిలుస్తుందో తెలియదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో.. స్టేడియంలో ఉన్న ఆడియెన్స్‌తో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది క్రికెట్ ప్రియుల ఎదురైన ఉత్కంట క్షణాలు. వారి మునివేళ్లపై నిలుచోబెట్టిందీ మ్యాచ్. ఇక పరాజయమే అనుకుని ఆశలు లేని పరిస్థితుల్లోంచి విజయతీరాలకు వచ్చిన కేఎల్ రాహుల్ సేన.. భారీగా పరుగులు చేసి కూడా ఓటమి దిశగా సాగిన బెంగళూరు... అంతలోనే ఇరు జట్లను దోబుచులాడిన విజయం.. అలా చివరి బంతికి వరకు క్రికెట్ అభిమానులను ఆసాంతం రక్తికట్టించింది. మొత్తంగా ఈ నాటకీయపరిణామాల మధ్య చివరి బంతికి ఫలితం దక్కింది. దీంతో లఖ్‌నవూను సంబరాల్లో మునిగిపోగా, ఆర్సీబీని తీవ్ర నిరాశలోకి నెట్టింది. మరి ఆ లాస్ట్ బాల్‌కు రాహుల్ సేన ఎలా విజయం సాధించిందో ఆ ఉత్కంఠ క్షణాలను చూసేయండి..
ఇదంతా ఎవరూ ఊహించనిదే.. అసలు ఈ మ్యాచ్ చివరి బంతికి వరకు సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. బెంగళూరు నిర్దేశించిన లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూలో.. పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మ్యాచ్ ముందే లఖ్‌నవూ చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమనిపించేలా కనిపించింది. ఇంకా 4 ఓవర్లలో చేయాల్సినది 28 పరుగులు మాత్రమే. కానీ 17వ ఓవర్లో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 పరుగులే ఇచ్చి పూరన్ వికెట్ పడగొట్టాడు. అయినా లఖ్‌నవూకు ఏమీ అప్పుడు దారులు మూసుకుపోలేదు. బదోని, ఉనద్కత్ మంచిగా ఆడి టీమ్ లక్ష్యం వైపు నడిపించారు. దీంతో లఖ్‌నవూకు 9 బంతుల్లో 7 పరుగులే అవసరమయ్యాయి.