తెలంగాణ

telangana

ETV Bharat / sports

GJ Vs KKR: ఆఖర్లో రింకూ సూపర్​ సిక్సులు.. కోల్​కతా ఘన విజయం

ఐపీఎల్​ 2023 సీజన్​లో వరుసగా రెండు మ్యాచ్​లు గెచిలి ఊపుమీదున్న గుజరాత్​ టైటాన్స్​ జట్టుకు నిరాశ ఎదురైంది. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో 3 వికెట్ల తేడాతో తొలి ఓటమి మూటుగట్టుకుంది.

ipl 2023 gt vs kkr result
ipl 2023 gt vs kkr result

By

Published : Apr 9, 2023, 7:23 PM IST

Updated : Apr 9, 2023, 10:14 PM IST

'ఐపీఎల్​ అంటేనే ఇలా ఉంటుంది' అన్నట్టుగా జరిగింది గుజరాత్​ టైటాన్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​ మ్యాచ్​. ప్రతి నిమిషానికి అంచనాలు మారిపోయాయి. ఏ జట్టు గెలుస్తుందో అని ఊహించడం కష్టతరమైంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిని ఈ మ్యాచ్​లో.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్​ జట్టుకు బ్రేక్​ పడింది. తొలి ఓటమితో నిరాశ ఎదురైంది. కోల్​కతా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్​ చరిత్రలో బెస్ట్​ ఛేదనలలో ఒకటిగా నిలిచిపోయింది.

గుజరాత్​ నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని.. కోల్​కతా జట్టు ఆఖరు వరకు పోరాడి 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి ఛేదించింది. వెంకటేశ్​ అయ్యర్​ (83) పరుగలతో దంచికొట్టాడు. 8 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిపోయాడు. ఇక యంగ్​ బ్యాటర్​ రింకు సింగ్​ (48*) విజృంభించి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగుల చేయాల్సి ఉండగా.. రెండు సిక్సులు బాదాడు. నితీశ్​ రాణా(45) పరుగులతో రాణించాడు. ఓపెనర్లు గుర్బజ్​(15), జగదీశన్(6) పేలవ ప్రదర్శన చేశారు.

ఇంపాక్ట్​ చూపిస్తున్న 'ఇంపాక్ట్​ ప్లేయర్​'..
ఐపీఎల్‌ 2023 సీజన్‌లో మొదటిసారి 'ఇంపాక్ట్‌ ప్లేయర్' రూల్​ తీసుకొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం దాని ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగితే ఇంపాక్ట్​ ప్లేయర్​ అంతగా ప్రభావం చూపించలేదు. బౌలింగ్‌ విభాగంలో ఇంపాక్ట్‌ ప్రభావం ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే, తాజాగా కోల్​కతా నైట్​ రైడర్స్​ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది. దీంతో చెలరేగిన పోయిన వెంకటేశ్​.. 83 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రింకూ సింగ్​ విధ్వంసం.. జస్ట్​ రికార్డ్​ మిస్​!
కోల్​కతా సాధించిన సంచలన విజయంలో.. రింకూ సింగ్​ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో ఈ ప్లేయర్​ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు విధ్వంసకర ప్రదర్శన చేశాడు. సిక్స్​లు కొట్టాడిలా..

టాస్​ గెలిచి మొదటి బ్యాటింగ్​ చేసిన గుజరాత్​ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. బ్యాటర్​ విజయ్​ శంకర్‌ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాయి సుదర్శన్‌ (53), శుభ్‌మన్‌ గిల్ (39) కూడా రాణించారు. వృద్ధిమాన్‌ సాహా (17), అభినవ్‌ మనోహర్‌ (14) పరుగులు చేశారు. ఇక, కోల్‌కతా నైట్​ రైడర్స్​ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ (3) వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా.. సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు

Last Updated : Apr 9, 2023, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details