తెలంగాణ

telangana

ETV Bharat / sports

GT vs KKR : టాస్​ గెలిచిన గుజరాత్​.. బ్యాటింగ్​ ఎవరంటే? - గుజరాత్​ కోల్​కతా మ్యాచ్​ ఐపీఎల్ వృద్ధిమాన్​ సాహా

IPL 2023 : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2023లో భాగంగా దిగ్గజ టీమ్​లు గుజరాత్ టైటాన్స్, నైట్​ రైడర్స్​ మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ ఎవరు గెలిచారంటే?

GT vs KKR toss
GT vs KKR toss

By

Published : Apr 9, 2023, 3:04 PM IST

Updated : Apr 9, 2023, 4:04 PM IST

IPL 2023 : ఐపీఎల్​ 16 సీజన్​లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్​కతా నైట్​ రైడర్స్​ మధ్య మ్యాచ్​ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో గుజరాత్​​ జట్టు టాస్​ గెలిచి.. బ్యాటింగ్​​​​ ఎంచుకుంది. ప్రత్యర్థి​ జట్టు కోల్​కతాకు బౌలింగ్​​ అప్పగించింది.

గుజరాత్​ టైటాన్స్​ జట్టు :వృద్ధిమాన్​ సాహా(వికెట్​ కీపర్), శుభ్​మన్​ గిల్, సాయి సుదర్శన్, విజయ్​ శంకర్, డేవిడ్​ మిల్లర్​, రాహుల్​ తెవాతియా, రషీద్​ ఖాన్​(కెప్టెన్), మహ్మద్​ షమి, అల్​జారీ జోసెఫ్​, యష్​ దయాల్, అభినవ్​ మనోహర్​

కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు :రహ్మదుల్లా గుర్బజ్​(వికెట్​ కీపర్), ఎన్​ జగదీశన్​, నితీశ్​ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్​, సునీల్​ నరైన్​, శార్దుల్​ ఠాకూర్, సుయాన్ష్​ శర్మ, లాకీ ఫెర్గుసన్, ఉమేశ్​ యాదవ్, వరున్​ చక్రవర్తి

టాస్​ గెలిస్తే.. బ్యాటింగ్​ అనుకున్నాం : నితీశ్​ రాణా
టాస్​ గెలిస్తే మేము ఫస్ట్​ బ్యాటింగ్​ చేయాలని అనుకున్నాం. వెదర్​, పిచ్​ పరిస్థితులు బాగున్నాయి. టార్గెట్​ను కాపాడుకోవడం సులభం అవుతుంది అనిపిస్తోంది. మా స్పన్నర్లు.. గుజరాత్​ బ్యాటర్లను అడ్డుకోగలరని అనుకుంటున్నా. ఈ మ్యాచ్​లో టిమ్​ సౌథీ, మన్​దీప్​ సింగ్​ స్థానాల్లో లాకీ ఫెర్గూసన్, జగదీశన్ తుది జట్టులోకి వచ్చారు.

పిచ్​ చాలా బాగుంది : రషీద్​ ఖాన్
నరేంద్రమోదీ స్టేడియంలో వికెట్​ చాలా బాగుందని గుజరాత్​ కెప్టెన్​ రషీద్ ఖాన్​ అన్నాడు.' ఈ పిచ్​ బాగుంది. అందుకే బ్యాటింగ్​ ఎంచుకున్నాం. కోల్​కతా ముందు మంచి లక్ష్యం ఉంచుతామని అనుకుంటున్నాం. ఒంట్లో బాగోలేకపోవడం వల్ల హార్దిక్​ ఈ మ్యాచ్​ ఆడటం లేదు. హార్దిక్​ స్థానంలో విజయ్​ శంకర్​ను తీసుకున్నాం.' అని రషీద్​ చెప్పాడు.

గెలుపు ఉత్సాహంతో గుజరాత్​..
స్టార్​ బ్యాటర్​ హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్​ జట్టు.. వరుస విజయాలతో ఊపుమీద ఉంది. అటు బ్యాటింగ్​లో ఇటు బౌలింగ్ లోనూ ఆధిపత్యం కనబరుస్తోంది. మొదట బ్యాటింగ్​ చేస్తే భారీ టార్గెట్​ను ప్రత్యర్థుల ముందు ఉంచుతోంది. ప్రత్యర్థి జట్టు ఎక్కువ పరుగులు చేసినా.. టార్గెట్​ను ఛేదిస్తోంది. అంతే కాకుండా కట్టుదిట్టమైన బౌలింగ్​తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తోంది. అదే ఉత్సాహంతో కోల్​కతాతో జరుగుతున్న ఈ మ్యాచ్​లో గెలవాలని గుజరాత్​ అనుకుంటోంది.

పట్టుదలతో కోల్​కతా...
కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్​లు ఆడింది. ఒక మ్యాచ్​లో గెలిచి.. మరో మ్యాచ్​లో ఓటమిపాలైంది. ఆర్​సీబీతో జరిగిన రెండో మ్యాచ్​లో బౌలర్​ వరుణ్ చక్రవర్తి కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా.. మరో బౌలర్​ సూయష్ శర్మ మాత్రం రెచ్చిపోయి 3 వికెట్లు తీశాడు. దీంతోపాటు విండీస్ స్టార్ క్రికెటర్ సునీల్ నరైన్ కూడా సత్తా చాటాడు. తొలుత తడబడిన శార్దుల్​ ఠాకూర్​.. ఆ తర్వాత తేరుకుని పరుగుల వరద పారించాడు. ఆర్​సీబీపై విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు.. బలమైన గుజరాత్ టైటాన్​తో తలపడుతోంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.

Last Updated : Apr 9, 2023, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details