గుజరాత్ టైటాన్స్ జట్టు స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు ప్లేయర్ రాహుల్ తెవాతియా ప్రేమ కోసం తాను ఓ త్యాగం చేశానని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం గుజరాత్, పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరి ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేరడం వల్ల మ్యాచ్‌ను ముగించే బాధ్యతను రాహుల్ తెవాతియా తీసుకున్నాడు. 19వ ఓవర్ ఐదో బంతికి బౌండరీ బాది జట్టుకు విజయాన్నిందించాడు.
మ్యాచ్ అనంతరం రాహుల్ తెవాతియా గురించి.. శుభ్‌మన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారడం వల్ల చివరి ఓవర్లలో బౌండరీలు సాధించడం కష్టం అయిందని అన్నాడు. అయితే మ్యాచ్‌ను తానే ముగించాల్సిందని. కానీ.. రాహుల్ తెవాతియాకు పంజాబ్ జట్టుతో ప్రత్యేక లవ్‌స్టోరీ ఉంది.. అందుకే అతడు మ్యాచ్‌ను ముగించాడని అని గిల్ సరదాగా అన్నాడు.
'ఇలాంటి పిచ్‌పై స్ట్రైక్‌ను రొటేట్ చేసుకుంటూ.. డాట్ బాల్స్ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ అయిపోగానే.. పవర్‌ప్లేలోనే ఎక్కువ పరుగులు రాబట్టాలని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టే రన్స్ చేశాం. ఇక హార్దిక్ పాండ్య పెవీలియన్ చేరడం వల్ల ఔటైన తర్వాత మేం కాస్త దూకుడును కోల్పోయాం. కానీ టార్కెట్ చిన్నదే కావడం వల్ల స్ట్రైక్ రొటేట్ పైనే దృష్టి సారించాం' అని శుభ్‌మన్ గిల్ వివరించాడు. గుజరాత్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన మోహిత్ శర్మపై కూడా శుభమన్ ప్రశంసించాడు. కాగా, మోహిత్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. రెండు వికెట్లు కూడా ఖాతాలో వేసుకుని గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తెవాతియా 'పంజాబ్ లవ్‌స్టోరీ' ఇదే..
గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తెవాతియా చివరి ఓవర్లో చెలరేగాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో.. రెండు సూపర్ సిక్స్‌లు బాదాడు. దీంతో గుజరాత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. దాన్ని దృష్టిలో ఉంచుకునే రాహుల్ తెవాతియాకు పంజాబ్‌తో ప్రత్యేక లవ్‌స్టోరీ ఉందని శుభ్‌మన్ గిల్ అన్నట్లు సమాచారం.