తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : చెపాక్​లో ధోనీ 200వ మ్యాచ్​.. టాస్​ నెగ్గిన చెన్నై.. అదరగొట్టేనా? - ఐపీఎల్​ 2023 చెన్నై రికార్డులు

ఐపీఎల్​ 16వ సీజన్​ భాగంగా చెన్నై సూపర్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్ మధ్య​ మరో ఆసక్తికరమైన మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలుచుకున్న చెన్నై.. బ్యాటింగ్​ ఎంచుకుంది.

ipl 2023 chennai super kings rajasthan royals dhoni 200th match
ipl 2023 chennai super kings rajasthan royals dhoni 200th match

By

Published : Apr 12, 2023, 7:02 PM IST

Updated : Apr 12, 2023, 7:29 PM IST

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా.. చెన్నైలోని చెపాక్​ మైదానం రసవత్తరమైన పోరుకు వేదికైంది. లీగ్​ చరిత్రలో మోస్ట్​ సక్సెస్​ఫుల్​ జట్టుగా పేరొందని చెన్నై సూపర్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టాస్​ గెలుచుకున్న చెన్నై.. బౌలింగ్​ ఎంచుకుంది. ప్రత్యర్థి రాజస్థాన్​కు బ్యాటింగ్​ అప్పగించింది. సీఎస్​కే సొంత మైదానంలో ధోనీ 200వ ఐపీఎల్​ మ్యాచ్ ఆడటం విశేషం.

తుది జట్లు:
చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), మగాలా, మహీశ్​ తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్​ సింగ్​.
రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్​ పడిక్కల్​, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్​ సేన్​, సందీప్​ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌.

ధోనీ అరుదైన ఘనత
ఐపీఎల్‌ చరిత్రలో ధోనీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఈ మ్యాచ్‌తో రానుంది. ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డును ఇప్పటికే సొంతం చేసుకున్న ధోనీ మరో అడుగు ముందుకేశాడు. సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీకిది 200వ మ్యాచ్‌ అవుతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 213 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. అందులో రైజింగ్‌ పుణె సూపర్ జెయింట్‌ జట్టుకు కూడా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే మ్యాచ్​కు ముందు ధోనీకి సీఎస్​కే ఫ్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్​ అరుదైన జ్ఞాపిక అందించారు.

ధోనీకి జ్ఞాపికను అందిస్తున్న సీఎస్​కే ఫ్రాంఛైజీ యజమాని

అతడికి గిఫ్ట్‌ ఇస్తాం: జడేజా
చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 200వ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఎంఎస్ ధోనీకి ప్రత్యేకంగా గిఫ్ట్‌ ఇస్తామని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వ్యాఖ్యానించాడు. "ఎంఎస్ ధోనీ క్రికెట్‌ లెజెండ్‌. 200వ మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తున్న ధోనీకి స్పెషల్‌ గిఫ్ట్‌ను అందిస్తాం. చెపాక్‌లో గెలిస్తే మాతోపాటు అభిమానులు ఆనందంగా ఉంటారు. గత మ్యాచ్‌లో విజయం సాధించాం. అదే ఊపును కొనసాగిస్తాం" అని జడ్డూ చెప్పాడు.

బౌలింగ్‌లో కాస్త వీకే..
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో కొనసాగుతోంది. చెపాక్‌ స్టేడియం వేదికగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కేవలం 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 200కిపైగా రన్స్ చేసినప్పటికీ బౌలర్ల వైఫల్యంతో కొద్ది వ్యత్యాసంతోనే గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో తేలిపోవడం చెన్నై అభిమానులను కలవరానికి గురి చేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిన తుషార్ దేశ్ పాండే వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించాడు. పరుగులపై నియంత్రణ సాధిస్తే మాత్రం తుషార్‌ కీలకమవుతాడు. రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీతో కూడిన బ్యాటింగ్‌ విభాగం చెన్నైకి పటిష్ఠంగానే ఉంది. మొయిన్ అలీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె అదరగొట్టేశాడు.

అయితే అంతర్జాతీయ టాప్‌ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌, ఆడమ్ జంపా రాజస్థాన్‌ సొంతం. ఇక ట్రెంట్ బౌల్ట్‌, జాసన్ హోల్డర్‌ పేస్‌తో చెన్నై బ్యాటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. రవిచంద్రన్ అశ్విన్‌ సొంత మైదానం చెపాక్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ భారత్‌ తరఫున, సీఎస్‌కేతోపాటు దేశవాళీలోనూ అశ్విన్ చాలా మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్‌ జట్టులో జోస్ బట్లర్, యశస్వి, సంజూ శాంసన్, హెట్మెయర్ వంటి హిట్టర్లు ఉన్నారు. అయితే, లఖ్‌నవూపై చేసినట్లు 200కిపైగా భారీ స్కోరు సాధిస్తేనే ఏ జట్టుకైనా విజయావకాశాలు ఉంటాయనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా.

పిచ్​ పరిస్థితేంటంటే?
చెపాక్‌ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌ పొడిగా ఉండటంతో బ్యాటింగ్‌తోపాటు స్పిన్నర్లకు కాస్త సహకారం లభిస్తుంది. అయితే, క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం పరుగులు చేయడం సులవుతుంది. సీఎస్‌కే, రాజస్థాన్‌ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు ఇప్పటి వరకు 67 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 41 సార్లు, ఛేదన జట్టు 26 సార్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170 పరుగులు కాగా.. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 246. అదీనూ 2010లో రాజస్థాన్‌పైనే చెన్నై సాధించడం విశేషం. అత్యల్ప స్కోరు 70 రన్స్. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డు ఉంది. టాస్‌ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చెన్నై X రాజస్థాన్ హెడ్​ టు హెడ్​..
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ ముఖాముఖిగా 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇప్పటి వరకు చెన్నై 15 మ్యాచుల్లో విజయం సాధించగా.. రాజస్థాన్‌ 11 మ్యాచుల్లో గెలిచింది. చెన్నై అత్యధిక స్కోరు 246 పరుగులు కాగా.. రాజస్థాన్‌ కూడా 223 పరుగులు సాధించడం గమనార్హం. సీఎస్‌కే అత్యల్ప స్కోరు 109 పరుగులు. ఇక రాజస్థాన్‌ అత్యల్ప స్కోరు 126 పరుగులు. గత సీజన్‌ మ్యాచ్‌లో సీఎస్‌కేపై రాజస్థాన్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Last Updated : Apr 12, 2023, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details