IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌ను పేలవమైన ప్రదర్శనతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆడిన రెండో మ్యాచ్‌లోనే అదరగొట్టిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సోమవారం తలపడనుంది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇవీ తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్:కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్:కేన్ విలియమ్సన్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్క్రమ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపార్డ్, వాషింగ్టన్ సుదర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
ఇదీ చూడండి:Virat Kohli: నా మెదడును స్కాన్ చేయిస్తా: విరాట్ కోహ్లీ