Shane Warne almost quit Rajasthan Royals: రాజస్థాన్‌ను తొలి సీజన్‌లోనే విజేతగా నిలిపి సంచలనం సృష్టించిన దిగ్గజ క్రికెటర్, దివంగత షేన్‌వార్న్.. ఆ టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టు యజమాని మనోజ్ బదాలేకు షాకిచ్చాడు. ఓ ఆటగాడిని ఎంపిక చేసే విషయంలో ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం వల్ల యజమానినే బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ టోర్నీ నుంచి తప్పుకొంటానని వార్న్ హెచ్చరించడంతో మనోజ్ చేసేదిలేక మిన్నకుండిపోయాడు. ఈ విషయాన్ని షేన్‌వార్న్ తన ఆటోబయోగ్రఫి 'నో స్పిన్'లో ఇలా రాసుకొచ్చాడు.
రాజస్థాన్ జట్టులో ఉండలేను.. షేన్ వార్న్ హెచ్చరిక! - IPL Season 1
Shane Warne almost quit Rajasthan Royals: ఐపీఎల్ తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి సంచలనం సృష్టించాడు దివంగత క్రికెటర్ షేన్ వార్న్. అయితే ఆ టోర్నీ ఆరంభానికి ముందు జట్టు యజమానికి షాకిచ్చాడు వార్న్. తాను చెప్పినట్లు వినకపోతే జట్టు నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
"అప్పుడు జట్టు ఎంపికలో మనోజ్ ఒక ఆటగాడిని ఎంపిక చేయాలని నన్ను కోరారు. కానీ, అతడిని ఎంపిక చేస్తే జట్టులో నాకు విలువ ఉండదని అనిపించింది. ఆ ఆటగాడు సరిగ్గా ఆడకపోయినా జట్టులో ఉన్నాడంటే.. ఎవరో కావాలనే అతడికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మిగతా ఆటగాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకునే వీలుంది. అప్పుడు నేను వారి నమ్మకాన్ని కోల్పోతాను. ఒకవేళ ఆ ఆటగాడిని కచ్చితంగా జట్టులో ఉంచాలనుకుంటే మీరే పెట్టుకోండి నేను వెళ్లిపోతాను. నేను ఈ జట్టులో ఉండలేను. మీ డబ్బు మీకు తిరిగిస్తా" అని చెప్పడం వల్ల "ఆయన నిజంగా నువ్వు వెళ్లిపోతావా?" అని అడగడంతో ఔనని బదులిచ్చా. దీంతో తర్వాతి రోజు మనోజ్ రాజీపడి ఆ ఆటగాడిని ఎంపికచేయకపోయినా ఫర్వాలేదని చెప్పాడు" అని వార్న్ తన పుస్తకంలో వివరించాడు.
ఇదీ చూడండి:IPL final 2022: ఈసారి కప్పు ఎవరికి దక్కెనో? కొత్తదనమా లేక పాతపరమా?