IPL 2022: టీ20 మెగా టోర్నీలో కోల్‌కతా మరో విజయం సాధించింది. ముంబయితో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబయి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది మూడో విజయం కాగా.. ముంబయికి వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (50 : 41 బంతుల్లో 6×4, 1×6), ఆఖర్లో వచ్చిన ప్యాట్ కమ్మిన్స్ (56 : 15 బంతుల్లో 4×4, 6×6) విధ్వంసం సృష్టించాడు. ముంబయి బౌలర్లలో టైమల్ మిల్స్, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ ఒక వికెట్ తీశాడు.
ప్యాట్ కమిన్స్ విధ్వంస బ్యాటింగ్.. ముంబయిపై కోల్‌కతా విజయం - KKR VS MI 2022
IPL 2022: ముంబయి ఇండియన్స్‌పై కోల్‌కతా గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ప్యాట్ కమిన్స్ విధ్వంస బ్యాటింగ్(56/15)తో కోల్‌కతాకు సునాయస విజయం అందించాడు.
కోల్‌కతా
కోల్‌కతా స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. గెలుపు కష్టమే అనుకున్న తరుణంలో వెంకటేశ్ అయ్యర్ కీలకంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అప్పటికే క్రీజులోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ చెలరేగిపోయాడు. 15 బంతుల్లో 56 బాది కోల్‌కతాకు విజయం అందించాడు.