తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచికొట్టిన మార్ష్​​, వార్నర్​.. రాజస్థాన్​పై దిల్లీ విజయం - దిల్లీ క్యాపిటల్స్​

IPL 2022 RR Vs Dc: రాజస్థాన్‌పై దిల్లీ అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌ ముందట భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌ 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో దిల్లీ బ్యాటర్లు మిచెల్‌ మార్ష్‌ (89), వార్నర్‌ (52*) అర్ధశతకాలతో దంచికొట్టి జట్టును విజయతీరాలకు చేర్చారు.

IPL 2022 RR Vs Dc
IPL 2022 RR Vs Dc

By

Published : May 11, 2022, 11:18 PM IST

IPL 2022 RR Vs Dc: రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లనే ఛేదించింది. మిచెల్ మార్ష్‌ (89; 62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్‌ (52; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. దిల్లీ మిగతా బ్యాటర్లలో శ్రీకర్‌ భరత్ (0) డకౌట్‌ కాగా.. రిషభ్‌ పంత్ (13; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్లు అశ్విన్‌ (50), దేవదత్‌ పడిక్కల్ (48) రాణించడం వల్ల ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాజస్థాన్‌ మిగతా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్‌ (19), జోస్ బట్లర్‌ (7), సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్‌ (9), డస్సెన్ (12*), ట్రెంట్ బౌల్ట్‌ (3*) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో చేతన్‌ సకారియా, ఆన్రిచ్‌ నార్జ్‌, మిచెల్ మార్ష్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details