తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022:  'అదే కొంత ఆందోళన కలిగించింది'​ - ఐపీఎల్ న్యూస్​

IPL 2022 RCB VS LSG: గత రెండు మ్యాచులతో పోలిస్తే ప్రస్తుతం మరింత మెరుగయ్యామన్నాడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్​ ఫాఫ్ డుప్లెసిస్​. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఇన్నింగ్స్​ బాగానే ప్రారంభించామని.. కానీ దానిని పూర్తిగా కొనసాగించలేకపోయామన్నాడు లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ కెప్టెన్​ కేఎల్ రాహుల్. మ్యాచ్​ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు ఈ వ్యాఖ్యలు చేశారు.

IPL 2022 news
IPL 2022 news

By

Published : Apr 20, 2022, 9:51 AM IST

IPL 2022 RCB VS LSG: తమ జట్టు చేసిన ప్రదర్శన సంతృప్తిని ఇచ్చిందన్నాడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్​ ఫాఫ్ డుప్లెసిస్​. గత రెండు మ్యాచులతో పోలిస్తే ప్రస్తుతం మరింత మెరుగయ్యామన్నాడు. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో మ్యాచ్​ అనంతరం డుప్లెసిస్​ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లఖ్​నవూపై విజయం సాధించింది.

"ఈ మైదానం స్వభావం వల్ల చాలా పరుగెత్తాల్సి వచ్చింది. దీని వల్ల తొందరగా అలసిపోతాం. 96 పరుగులపై ఉన్నప్పుడు శతకం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఇన్నింగ్స్​ను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా ఆటతో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి పెద్ద మైదానాల్లో స్లోగా బౌలింగ్​ చేస్తే బౌండరీలు కొట్టడం చాలా కష్టం. బౌండరీకి తరలించే శక్తి ఉండదు. నేను కూడా అలసిపోయాను కానీ తప్పదు. ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్​ బౌలర్లకు సహకారం అందించడం వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి పిచ్​ బ్యాటర్లకు చాలా కఠినమైంది. చాలా జట్లు ప్లేఆఫ్​ స్థానం కోసం పోటీపడుతున్నాయి. కానీ అది మన నియంత్రణలో ఉండదు మనం మన బలాలపైన దృష్టి పెట్టాలి. జట్టులో నిలకడగా ఆడే ఆటగాడు కావాలి. దినేశ్​ కార్తీక్​ కొంత మేర ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. గత రెండు మ్యాచుల్లో డెత్​ బౌలింగ్​ కొంత ఆందోళన కలిగించింది. కానీ ఇప్పుడు కొంత మెరుగయ్యాం. హర్షల్​ అద్భుతమైన ఆటగాడు. ఈ సీజన్​లో అతడు మరింత ప్రత్యేకంగా మారబోతున్నాడు"

-ఫాఫ్ డుప్లెసిస్​, కెప్టెన్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

"మేము తొలి ఓవర్​లోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్​ను బాగానే ప్రారంభించాం. కానీ పవర్​ప్లేలో 50 పరుగులు ఇచ్చాం. ఈ పిచ్​పై 180 పెద్ద స్కోర్.​ నాకు తెలిసి 15 నుంచి 20 పరుగులు ఎక్కువ ఇచ్చాం. ఒక బ్యాటర్​ దూకుడుగా ఆడితే మరొకరు సహకారం అందిచాలి. కానీ అది మేము చేయలేదు. మాది మంచి జట్టు ప్రస్తుతం ఆడుతున్న ఆటతో సంతోషంగా ఉన్నాం. రాజస్థాన్​తో మ్యాచ్​లోను బాగానే ఆరంభించాం. మొదట ఒత్తిడిలోకి నెట్టినా దాన్ని పూర్తిగా కొనసాగించలేకపోయాం. అందరూ మంచి ఫామ్​లో ఉన్నారు. ముఖ్యంగా కుర్రాళ్లు మరింత రాణించాల్సిన అవసరం ఉంది"

-కేఎల్​ రాహుల్​, కెప్టెన్ లఖ్​నవూ సూపర్​ జెయింట్స్

ఐపీఎల్​ 2022లో నూతనంగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్​ టైటాన్స్ జట్టు.. ఆరు మ్యాచులాడి ఐదింట్లో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలించింది. కాగా అత్యధికంగా టైటిళ్లు గెలిచిన చెన్నైసూపర్​కింగ్స్, ముంబయి ఇండియన్స్​ జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి.​

ఇదీ చదవండి:బెంగళూరు భళా.. లఖ్​నవూ సూపర్​ జెయంట్స్​పై ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details