మొదటి 15 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన ముంబయి బ్యాటర్లు ఆ తర్వాత కాస్త వేగం పెంచారు. దీంతో ఆఖరి ఐదు ఓవర్లలోనే 76 పరుగులు రాబట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ- కేకేఆర్ లక్ష్యం 162 - ipl live score 2022 today
IPL 2022: సూర్యకుమార్ యాదవ్, పోలార్డ్ విజృంభణతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20ఓవర్లలో 161 చేసింది. కేకేఆర్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంది.
ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (52 : 36 బంతుల్లో 5×4, 2×6) అర్ధ శతకంతో రాణించాడు. తిలక్ వర్మ (38 : 27 బంతుల్లో 3×4, 2×6), డెవాల్డ్ బ్రెవీస్ (29 : 19 బంతుల్లో 2×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ (3) విఫలం కాగా.. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆఖర్లో వచ్చిన కీరన్ పొలార్డ్ (22 : 5 బంతుల్లో 3×6) పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ రెండు, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో తలో వికెట్ పడగొట్టారు.