IPL 2022: ఐపీఎల్ లీగ్ దశ భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది దిల్లీ క్యాపిటల్స్. ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి లఖ్‌నవూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు గుజరాత్‌పై ఓడిన దిల్లీ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
లఖ్‌నవూ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దిల్లీ ఆడిన రెండిట్లో ఒకటి గెలిచి మరోటి ఓడి.. పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన లఖ్‌నవూ.. దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తుది జట్లు