IPL 2022: వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆండ్రీ రసెల్ (70*) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) ఫర్వాలేదనిపించాడు. రహానె (12), వెంకటేశ్ అయ్యర్ (3), నితీశ్ రాణా (0) నిరాశపరిచారు. సామ్ బిల్లింగ్స్ (24) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు, ఓడియన్ స్మిత్, రబాడ, చెరో వికెట్ పడగొట్టారు.
IPL 2022: రసెల్ విధ్వంసం.. పంజాబ్‌పై కోల్‌కతా ఘనవిజయం - ఐపీఎల్ 2022
IPL 2022: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఆండ్రీ రసెల్ (70*) మెరుపు అర్ధశతకం చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను పటిష్ఠమైన బౌలింగ్‌తో కట్టడి చేశారు కోల్‌కతా బౌలర్లు. పంజాబ్ బ్యాటర్లలో భనుక రాజపక్స (9 బంతుల్లోనే 31) మెరిశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (19), ఓపెనర్ శిఖర్ ధావన్ (16), హర్‌ప్రీత్ బ్రార్ (14), రాజ్ బవా (11) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ సహా మిగిలినవారు విఫలమయ్యారు. దీంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, టిమ్ సౌథీ 2, శివం మావి, నరైన్, రసెల్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి:కోహ్లీ, రోహిత్‌ను ఢీకొనాలి.. వారికి అది నచ్చదు: అశ్విన్