తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజృంభించిన బౌలర్లు.. కోల్​కతాపై లఖ్​నవూ ఘన విజయం - ఐపీఎల్​ ఐపీఎల్​ 2022

IPL 2022 KKR Vs LSG: కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ జట్టు అదరగొట్టింది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి 75 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ipl-2022-kkr-vs-lsg lucknow won by 75 runs
ipl-2022-kkr-vs-lsg lucknow won by 75 runs

By

Published : May 7, 2022, 11:05 PM IST

IPL 2022 KKR Vs LSG: లఖ్‌నవూ బౌలర్ల దెబ్బకు కోల్‌కతా కుదేలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 101 పరుగులకే కుప్పకూలింది. దీంతో లఖ్‌నవూ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో హార్డ్‌హిట్టర్‌ ఆండ్రూ రస్సెల్‌ (45), సునిల్ నరైన్‌ (22), ఆరోన్‌ ఫించ్‌ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేదు. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3, జాసన్ హోల్డర్ 3.. మోహ్‌సిన్‌ ఖాన్‌, చమీర, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో లఖ్‌నవూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దీంతోపాటు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.

అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ (50) హాఫ్ సెంచరీ సాధించగా.. దీపక్‌ హుడా (41), కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (28), అయుష్‌ బదోని (15*), జాసన్ హోల్డర్ (13) రాణించారు. ఆండ్రూ రస్సెల్ 2.. టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, సునిల్ నరైన్ తలో వికెట్ తీశారు. శివమ్‌ మావి వేసిన ఓవర్‌లో లఖ్‌నవూ బ్యాటర్లు ఐదు సిక్సర్లు బాదడం విశేషం. ఇందులో మూడు స్టొయినిస్‌ కొట్టగా.. మరో రెండు హోల్డర్‌ బ్యాట్‌ నుంచి వచ్చాయి. అయితే మరో భారీ షాట్‌కు యత్నించి స్టొయినిస్‌ ఔటయ్యాడు.

ఇదీ చదవండి:IPL 2022: మెరిసిన యశస్వీ, చాహల్​.. పంజాబ్​పై రాజస్థాన్​ విజయం

ABOUT THE AUTHOR

...view details