IPL 2022 Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్కు భారీ జరిమానా పడింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది ఎస్ఆర్హెచ్.
IPL 2022: అసలే ఓటమి బాధలో సన్‌రైజర్స్.. కెప్టెన్‌కు భారీ షాక్ - IPL 2022
IPL 2022 Kane Williamson: రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణంగా ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్కు భారీ జరిమానా పడింది. ఎందుకంటే?
ముంబయిలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్.. కెప్టెన్ సంజూ శాంసన్ (50), పడిక్కల్ (41) చెలరేగడం వల్ల 210 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ తేలిపోయింది. మార్క్రమ్ (57), సుందర్ (40) మినహా ఏ ఒక్కరూ బ్యాటింగ్‌లో రాణించలేదు. దీంతో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురైన అభిమానులు.. సామాజిక మాధ్యమాల్లో జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:IPL 2022: సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ ఘన విజయం