IPL 2022: మెగా టీ20 టోర్నీలో ప్రస్తుతం టాప్-1లో ఉన్న గుజరాత్ జట్టుకు ముంబయి షాకిచ్చింది. ఆఖరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. వృద్ధీమాన్ సాహా (55; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభమన్ గిల్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ముంబయి బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు, పొలార్డ్ ఒక వికెట్ తీశారు.
గుజరాత్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం - ఐపీఎల్ 2022 న్యూస్
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్రకు ముంబయి బ్రేక్ ఇచ్చింది. ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ శుభారంభం అందించడం వల్ల నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (45; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో టిమ్ డేవిడ్ (44; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (21), పొలార్డ్ (4) పరుగులతో నిరాశ పరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, అల్జరీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చదవండి:డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్‌పై స్వీట్ రివెంజ్..