తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హైదరాబాద్​ అభిమానులు ఫుల్​ కుష్​'.. చెన్నైపై నెటిజన్ల సెటైర్లు! - ఐపీఎల్​ 2022

IPL 2022: ఐపీఎల్​ 2022లో ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమిపాలైన చెన్నైపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. హైదరాబాద్​ అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చంటూ మరింత హాస్యం జోడిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వారాంతంలో చెన్నైతో హైదరాబాద్​ తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఈ విధంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Trolls on Chennai
రవీంద్ర జడేజా

By

Published : Apr 4, 2022, 12:26 PM IST

IPL 2022: మెగా టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని సామాజిక మాధ్యమాల్లో చెన్నై అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ టీ20 లీగ్‌లో చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోవడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా లఖ్‌నవూ, పంజాబ్‌ లాంటి జట్లతోనూ ఓటమిపాలవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో ఓటమిపాలై.. టోర్నీ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద ఓటమిని చవిచూసింది. దీంతో పలువురు అభిమానులు ఆ జట్టు ఆటతీరును ఎండగడుతున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చంటూ మరింత హాస్యం జోడిస్తూ వారు ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఈ వారాంతం చెన్నైతోనే తలపడాల్సి ఉంది. అప్పుడు కూడా చెన్నై ఓడిపోతుందని, దీంతో ఆ జట్టుకన్నా హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్తుందని అభిమానులు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌ టీమ్‌ ఇప్పటివరకు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలై.. రన్‌రేట్‌ పరంగా మరీ వెనుకంజలో ఉండటంతో పదో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది. ఆన్‌లైన్‌లో అలరిస్తోన్న మీమ్స్‌ ఏంటో మీరూ ఓ లుక్కేయండి.

ABOUT THE AUTHOR

...view details