IPL 2022 Dhoni Conway: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తప్పుకుంటానని ధోనీ తనకు ముందే చెప్పాడని తెలిపాడు ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే. కొద్దిరోజుల క్రితం మహీతో తాను మాట్లాడిన విషయాలను చెప్పాడు.
"నేను మహీ కెప్టెన్సీలో ఆడాలనుకున్నా. ఈ విషయంపై అతడితో చర్చించాను కూడా. మీరు కచ్చితంగా కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నారా?ఈ ఒక్క సీజన్ కెప్టెన్సీ చేయలేరా? అలా చేస్తే నేను మీ సారథ్యంలో ఆడే అవకాశం ఉంటుందని అడిగాను. అప్పుడు అతడు స్పందిస్తూ.. 'నేను కెప్టెన్‌గా ఉండను. కానీ, ఎప్పుడూ జట్టుతోనే కలిసి ఉంటా'నని వెల్లడించాడు"
-డెవాన్ కాన్వే, ఓపెనర్ చెన్నై సూపర్ కింగ్స్
ఈ సీజన్‌కు రెండు రోజుల ముందు ధోనీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆ బాధ్యతలను ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. దీంతో జడ్డూ చెన్నై జట్టును నడిపిస్తున్నాడు. అయితే, కోల్‌కతాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు టాప్ ఆర్డర్ విఫలమై తక్కువ స్కోరే సాధించింది. దీంతో మ్యాచ్ కోల్పోయి ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. ఇక నేడు చెన్నై.. లఖ్‌నవూతో తలపడనుంది. ఈసారి పరుగులు చేయాలని ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పట్టుదలగా ఉన్నారు.
ఇదీ చదవండి:ఐపీఎల్లో రోహిత్కేమో రూ.3కోట్లు.. కోహ్లీకి రూ.12లక్షలే!