తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: దిల్లీ ప్లేఆఫ్​ ఆశలు సజీవం.. పంజాబ్​పై విజయం - ఐపీఎల్ 2022 న్యూస్​

IPL 2022: పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్​ను 142 పరుగులకే కట్టడి చేసింది.

IPL 2022
IPL 2022

By

Published : May 16, 2022, 11:25 PM IST

Updated : May 16, 2022, 11:37 PM IST

IPL 2022: ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ సత్తా చాటింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో జితేశ్ శర్మ (44; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్‌ స్టో (28; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా.. ధావన్‌ (19) ఫర్వాలేదనిపించాడు. మయాంక్ అగర్వాల్ (0) డకౌట్ కాగా.. లివింగ్ స్టోన్‌ (3), హర్‌ప్రీత్ (1), రిషి ధావన్‌ (4), అర్ష్‌దీప్‌ సింగ్ (2), రాహుల్ చాహర్‌ (25*) పరుగులు చేశారు.

అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థికి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది. ఆల్​రౌండర్​ మిచెల్ మార్ష్‌ (63; 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్‌ (32; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. దిల్లీ మిగతా బ్యాటర్లలో లలిత్‌ యాదవ్‌ (24) ఫర్వాలేదనిపించగా.. డేవిడ్ వార్నర్ (0) గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. రిషభ్‌ పంత్ (7), రోమన్‌ పావెల్ (2), శార్దూల్ ఠాకూర్‌ (3), అక్షర్‌ పటేల్ (15*), కుల్‌దీప్‌ యాదవ్‌ (3*) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక వికెట్ తీశాడు.

ఇదీ చదవండి:ఐపీఎల్​ వార్​.. మూడు బెర్తులు.. ఐదు టీమ్‌లు..

Last Updated : May 16, 2022, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details