తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన దిల్లీ... గుజరాత్​ బ్యాటింగ్ - ipl live score 2022

IPL 2022: గుజరాత్​ టైటాన్స్​తో జరగనున్న మ్యాచ్​లో టాస్​ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్​ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్​ విజయాలతో జోరు మీదున్న ఇరు జట్లలో నేడు పైచేయి ఎవరు సాధిస్తారో చూడాలి.

delhi capitals vs gujarat titans
ipl 2022

By

Published : Apr 2, 2022, 7:04 PM IST

Updated : Apr 2, 2022, 7:23 PM IST

IPL 2022: డబుల్‌ బొనాంజాలో రెండో మ్యాచ్‌ గుజరాత్‌, దిల్లీ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుని గుజరాత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. టీ20 లీగ్‌లో అత్యధికసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయినే ఈ సారి తొలి మ్యాచ్‌లో దిల్లీ మట్టికరిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న దిల్లీని ఢీకొట్టేందుకు గుజరాత్‌ శాయశక్తులా ప్రయత్నించాలి. దిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీషా, రిషభ్‌ పంత్, రోవ్‌మన్‌ పావెల్, టిమ్‌ సీఫెర్ట్‌ కీలకంగా కాగా.. బౌలింగ్‌లో శార్దూల్, ఖలీల్ అహ్మద్, అక్షర్‌, కుల్‌దీప్‌, నాగర్‌ కోటి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలరు. శార్దూల్‌, అక్షర్‌ వంటి ఆల్‌రౌండర్లు ఉండటం దిల్లీకి కలిసొచ్చే అంశమే.

అదేవిధంగా హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌కు గిల్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, వేడ్‌ వేగంగా పరుగులు చేసే బ్యాటర్లు ఉన్నారు. షమీ, లాకీఫెర్గూసన్, హార్దిక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి టాప్‌ బౌలర్లు గుజరాత్ సొంతం. కెప్టెన్‌ హార్దిక్‌తోపాటు రషీద్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ చేయడం గుజరాత్‌కు అదనపు బలం. సమష్టిగా రాణిస్తే దిల్లీపై గుజరాత్‌ పైచేయి సాధించే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:

దిల్లీ: పృథ్వీ షా, టిమ్‌ సీఫెర్ట్, మన్‌దీప్‌ సింగ్, రిషభ్‌ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్‌ పావెల్, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్‌ రహ్మన్‌

గుజరాత్‌: శుభ్‌మన్‌ గిల్‌, మ్యాథ్యూ వేట్ (కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్‌, రషీద్‌ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్‌ ఆరోన్, షమీ

ఇదీ చూడండి:ప్రపంచకప్​ ఫైనల్లో ఆసీస్-ఇంగ్లాండ్ ఢీ.. ఆ జట్టుకు మోదీ విషెస్

Last Updated : Apr 2, 2022, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details