IPL 2022 CSK Vs DC: అసలైన ఛాంపియన్ ఆటను చెన్నై అభిమానులకు రుచి చూపించింది. మంచి ఫామ్‌లో ఉన్న దిల్లీపై 91 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది. దిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (25), శార్దూల్ ఠాకూర్ (24), రిషభ్ పంత్ (21), డేవిడ్ వార్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, బ్రావో 2, ముకేశ్ చౌదరి 2, సిమర్‌జిత్ సింగ్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు. ఈ ఓటమితో దిల్లీ (10) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు అద్భుత విజయం సాధించిన చెన్నై (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
అదరగొట్టిన బౌలర్లు.. దిల్లీని చిత్తు చేసిన ధోనీ సేన
IPL 2022 CSK Vs DC: ఐపీఎల్ 15వ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న దిల్లీపై 91 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో పంత్ సేన(10) తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోరు సాధించింది. డేవన్ కాన్వే (87), రుతురాజ్ గైక్వాడ్ (41), శివమ్ దూబే (32), ఎంఎస్ ధోనీ (21*) దూకుడుగా ఆడటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో దిల్లీకి 209 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఆరంభ ఓవర్లలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. తర్వాత వేగంగా పరుగులు సాధించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను తీయడంతో చెన్నై ఇంకా ఎక్కువ పరుగులు చేయకుండా దిల్లీ బౌలర్లు అడ్డుకోగలిగారు. ఆన్రిచ్ నోకియా 3, ఖలీల్ 2, మిచెల్ మార్ష్ ఒక వికెట్ తీశారు.
ఇదీ చదవండి:IPL 2022: చెలరేగిన హసరంగ.. హైదరాబాద్‌పై బెంగళూరు ఘన విజయం