కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ రెండో దశ(IPL Second Phase 2021) ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైపోయింది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ తలపడగా.. సోమవారం(సెప్టెంబరు 20) రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైడ్రైడర్స్(RCB Vs KKR 2021) జట్లు తలపడనున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore).. ఈ సీజన్ తొలి దశలో అద్భుతంగా రాణించి అభిమానులను ఉత్సాహపరిచింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో(10 పాయింట్లు)(IPL Points Table) మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడదే జోరుతో రెండో దశలోనూ ప్రత్యర్థులను చిత్తు చేయాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది.
ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ఏబీ డివిలియర్స్ , దేవదత్ పడిక్కల్, ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో బలంగానే ఉంది. అయితే గత కొద్దీ కాలంగా నెమ్మదిగా ఆడుతున్న విరాట్ ఈ సారి ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, కైల్ జెమీసన్, హర్షపటేల్, నవదీప్ సైనీ, చాహల్ వంటి ప్లేయర్స్ పటిష్ఠంగా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమైన అడం జంపా, కేన్ రిచర్డ్సన్ స్థానంలో శ్రీలంక ప్లేయర్స్ వానిందు హసరంగ, దుష్మంత చమీరాను తీసుకుంది జట్టు. వీరు ఎలా ప్రదర్శిస్తారో చూడాలి. మొత్తంగా జట్టు సమిష్టిగా రాణిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి.