తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: కోహ్లీ, మ్యాక్స్​వెల్​ మెరుపులు .. ముంబయి లక్ష్యం 166 - ముంబయి లక్ష్యం

ముంబయి ఇండియన్స్​కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(rcb vs mi 2021). ముంబయి బౌలర్లలో బుమ్రా 3, బౌల్ట్​, మిల్నే, చాహర్​ తలో వికెట్​ తీశారు.

ipl
ఐపీఎల్​

By

Published : Sep 26, 2021, 9:21 PM IST

Updated : Sep 26, 2021, 9:30 PM IST

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయ్​ల్​ఛాలెంజర్స్​ బెంగళూరు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో బుమ్రా 3, బౌల్ట్​, మిల్నే, చాహర్​ తలో వికెట్​ తీశారు. కోహ్లీ(51), గ్లెన్​ మ్యాక్స్​వెల్​(56) హాఫ్​ సెంచరీలతో మెరిశారు.

మొదట టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీకి శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే దేవదత్​ పడిక్కల్​(0) ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్​ అయ్యాడు. బుమ్రా వేసిన 1.4 బంతికి అతడు కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్​ భరత్​(32) సారథి కోహ్లీతో కలిసి మంచి ఇన్నింగ్స్​ ఆడాడు. ఈ క్రమంలోనే రాహుల్‌ చాహర్‌ వేసిన 8.5 ఓవర్‌కు అతడు ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్​కు 68పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న విరాట్​ను ఆడమ్‌ మిల్నే అడ్డుకున్నాడు. దీంతో కోహ్లీ మూడో వికెట్​గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత గ్లెన్​ మ్యాక్స్​వెల్​(56), ఏబీ డివిలియర్స్​(11), అహ్మద్​(1) ఔట్​ అయ్యారు. మొత్తంగా ప్రత్యర్థి జట్టు ముందు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇదీ చూడండి: IPL 2021: టాస్​ గెలిచిన ముంబయి.. ఆర్సీబీ బ్యాటింగ్​

Last Updated : Sep 26, 2021, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details