అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో పాటు దేశవాళీ క్రికెటర్లు కలిసి ఆడే అవకాశం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కల్పిస్తోంది. ఇప్పటివరకు పద్నాలుగు సీజన్లు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 15వ సీజన్ జరగనుంది. ఈ క్రమంలో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ(bcci ipl) సిద్ధమైంది. అందులో భాగంగా రిటెన్షన్(ipl retention) విధానం తీసుకొచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురేసి ఆటగాళ్లను(ipl retention list) అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. ఒక్కో జట్టు ఆటగాళ్ల రిటెయిన్, వేలం కోసం మొత్తం రూ.90 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. వేలంలోకి వచ్చే ఆటగాళ్లలో నుంచి కొత్తగా వచ్చే రెండు జట్లు (అహ్మదాబాద్, లఖ్‌నవూ) మొదట ఎంచుకునే వీలుంది. ఫ్రాంచైజీల రిటెన్షన్ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు(ipl franchise) బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్ చేసుకుంది.
ముంబయి ఇండియన్స్ (4)
ఐపీఎల్‌లో అత్యధిక ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్(mumbai indians retention). ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్‌తోపాటు ఫిట్‌నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం రూ.42 కోట్లను కేటాయించింది. రోహిత్‌కు రూ.16 కోట్లు, బుమ్రా (రూ.12), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ.6 కోట్లు)తో రిటెయిన్(mumbai indians retained players) చేసుకుంది. ఇంకా ముంబయి వద్ద రూ.48 కోట్లు ఉంటాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (4)
నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు(chennai super kings) ధోనీకి విడదీయరాని బంధం ఉంది. ఈసారి కూడా సీఎస్‌కే ధోనీని రిటెయిన్ చేసుకుంది. ధోనీ కాకుండా రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీను అట్టపెట్టుకుంది. 'ధోనీ కోసం రూ.12 కోట్లు కేటాయించిన సీఎస్‌కే(chennai super kings retention).. జడేజాకు రూ.16 కోట్లు, మొయిన్ అలీకి రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 6 కోట్లు కేటాయించింది. నలుగురి మీద రూ.42 కోట్లు ఖర్చు పెట్టిన సీఎస్‌కే.. మిగిలిన మొత్తంతో చిన్న తలా'గా పేరొందిన సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు సహా దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌ను వేలంలో కొనుగోలు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ (4)
గత ఐపీఎల్‌లో కేకేఆర్‌ను(kkr retention list) ఫైనల్‌కు చేర్చిన ఇయాన్ మోర్గాన్ ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు. దీంతో మోర్గాన్‌ను కేకేఆర్ రిటెయిన్ చేసుకోలేదు. అయితే వేలంలో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కేకేఆర్‌కు కూడానూ నూతన సారథినే ఎంపిక చేస్తుందో చూడాలి. సునీల్ నరైన్ (రూ.6 కోట్లు), ఆండ్రూ రస్సెల్ (రూ.12 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ.8 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు)ను రిటెయిన్(kkr retained players 2022) చేసుకుంది. శుభ్‌మన్ గిల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపొచ్చు. నలుగురు ఆటగాళ్ల కోసం రూ.34 కోట్లు కేటాయించింది.
దిల్లీ క్యాపిటల్స్ (4)
గత ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో దిల్లీక్యాపిటల్స్‌ను(delhi capitals retained players 2022) అగ్రస్థానంలో నిలిపిన రిషభ్ పంత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలను జట్టు మేనేజ్‌మెంట్ అప్పగించింది. రిషభ్ (రూ.16 కోట్లు) పాటు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), ఓపెనర్ పృథ్వీ షా (రూ.7.5 కోట్లు), పేస్ బౌలర్ ఎన్రిచ్ నార్జ్ (రూ.6.5 కోట్లు)లను అట్టిపెట్టుకుంది. మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వేలంలో కొనుగోలు చేసే అవకాశం లేకపోవచ్చు. కొత్త జట్టు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ దక్కించుకుని కెప్టెన్ చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను వేలంలో కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి.