తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: సంజు సూపర్​ బ్యాటింగ్​.. సన్​రైజర్స్​ లక్ష్యం 165 - ipl 2021 second phase live score

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ మంచి ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్టు ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సన్​రైజర్స్​ బౌలర్లలో సిద్ధార్థ్​ కౌల్​ 2, సందీప్​ శర్మ, భువనేశ్వర్​ కుమార్​, రషీద్​ ఖాన్​ తలో వికెట్​ తీశారు.

ipl
ఐపీఎల్​

By

Published : Sep 27, 2021, 9:14 PM IST

Updated : Sep 27, 2021, 9:40 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మెన్​ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సంజు శాంసన్​(82) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. సన్​రైజర్స్​ బౌలర్లలో సిద్ధార్థ్​ కౌల్​ 2, సందీప్​ శర్మ, భువనేశ్వర్​ కుమార్​, రషీద్​ ఖాన్​ తలో వికెట్​ దక్కించుకున్నారు.

టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌ మంచి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (6) విఫలం కాగా.. అనంతరం వచ్చిన సంజూ శాంసన్‌ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ (38)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్‌ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్‌ను మహిపాల్‌ లామరర్‌ (29)తో కలిసి శాంసన్‌ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్‌ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్‌ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ 2.. సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Last Updated : Sep 27, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details