దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. పస్తుత ఐపీఎల్ సీజన్లో తిరిగి ఆడే అవకాశం ఉందని సమాచారం. తన కుటుంబ సభ్యులు కొవిడ్ బారిన పడటం వల్ల టోర్నీ నుంచి నిష్క్రమించిన అశ్విన్.. ఇప్పుడు తిరిగి టోర్నీలో ఆడేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 25న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించిన అనంతరం అశ్విన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకోవడం వల్ల తిరిగి జట్టుతో చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అహ్మదాబాద్, దిల్లీ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఆ తర్వాత కోల్‌కతా, బెంగళూరులోని స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. దిల్లీ క్యాపిటల్స్ జట్టు మే 11న కోల్‌కతాకు పయనమవుతుంది. ఆ సమయానికి అశ్విన్.. దిల్లీ జట్టుతో కలిసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
"దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టుతో కలవనున్నాడని విన్నాను. అతడి ఇంటి దగ్గర పరిస్థితులు చక్కబడ్డాయని తెలిసింది. అదే నిజమైతే అశ్విన్‌ను తిరిగి లీగ్‌లో చూడొచ్చు. అతడికి మానసికంగా కొంత విశ్రాంతినివ్వాలి. ఇలాంటి క్రికెటర్లే మనకు కావాల్సింది."