చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చెమటోడ్చి నెగ్గింది. దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా ఫైనల్‌కి చేరింది. ఓటమి పాలైన దిల్లీ లీగ్ నుంచి నిష్క్రమించింది. కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (55) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (46) రాణించాడు. నితీశ్ రాణా (13), రాహుల్ త్రిపాఠి (12) ఫర్వాలేదనిపించారు. దినేశ్ కార్తిక్ (0), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0), షకిబ్ అల్ హసన్ (0), సునీల్ నరైన్ (0) డకౌటయ్యారు. దిల్లీ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
IPL 2021 Qualifier 2: వెంకటేశ్ అయ్యర్ అదరహో.. ఫైనల్‌కు కోల్‌కతా - కేకేఆర్ లైవ్ స్కోర్
ఐపీఎల్ క్వాలిఫయర్స్-2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. దిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.5 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు అడుగుపెట్టింది.
అంతకు ముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి నిలకడగానే ఆడింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (30*) పరుగులతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (18) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి వేసిన ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (18).. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శివమ్ మావి వేసిన 12వ ఓవర్లో బౌల్డై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ధావన్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షకిబ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (6) విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన షిమ్రోన్ హెట్‌మైర్ (17) దూకుడుగా ఆడాడు. అక్షర్ పటేల్ (4) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి..చేతులెత్తేసిన దిల్లీ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా ముందు స్వల్పలక్ష్యం