స్టార్ క్రికెటర్ ధోనీలా బ్యాటింగ్ లేదంటే వికెట్ కీపింగ్ చేయాలనో యువ క్రికెటర్లు ఆరాటపడుతుంటారు. అయితే ధోనీలా ఎవరూ ఉండలేరని, తను తనలానే ఉంటానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
'ధోనీలా ఎవరూ ఉండలేరు.. అది కష్టం' - ఐపీఎల్ న్యూస్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సంజూ శాంసన్. త్వరలో మొదలయ్యే ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు శాంసన్.
గత సీజన్లో కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌ను వదులుకున్న తర్వాత సంజూకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం గురించి కూడా మాట్లాడిన ఇతడు.. ఈ సీజన్లో కచ్చితంగా అభిమానుల ముఖంపై చిరునవ్వు తెప్పిస్తామని హామీ ఇచ్చాడు. తాము ఎలాంటి పరిస్థితిల్లో ఉన్నాసరే ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు.
ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది రాజస్థాన్. శివమ్ దూబెను కూడా తీసుకుంది. మరి వీళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఏప్రిల్ 12న జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో రాయల్స్ తలపడనుంది.