ఐపీఎల్ 2021 (IPL 2021 Live) సెకండ్ ఫేజ్లోనూ కరోనా కలవరం రేపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad ipl) పేసర్ నటరాజన్(natarajan ipl 2021)కు కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. దీంతో దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో నట్టూతో పాటు అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురిని క్వారంటైన్లో ఉంచింది సన్‌రైజర్స్. తాజాగా కరోనా కారణంగా దూరమైన నటరాజన్‌కు తాత్కాలిక భర్తీగా మరో ఆటగాడిని తీసుకుంది. అతడే జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రన్ మాలిక్(umran malik sunrisers hyderabad). నట్టూ మహమ్మారి నుంచి కోలుకుని తిరిగే బయోబబుల్‌లో చేరేవరకు ఉమ్రన్ జట్టుకు సేవలందిస్తాడు. యూఏఈలో ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు నెట్‌బౌలర్‌గా కొనసాగుతున్నాడు మాలిక్.
ఎవరీ ఉమ్రన్?
ఉమ్రన్ మాలిక్(umran malik sunrisers hyderabad) స్వస్థలం జమ్మూ కశ్మీర్. నవంబర్ 22, 1999లో జన్మించాడు. ఆ రాష్ట్రం తరఫునే దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఒకే ఒక టీ20 ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇతడు పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.