కోల్‌కతా నైట్ రైడర్స్(kolkata sunrisers ipl match) మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌పై ఆరో విజయం సాధించి 12 పాయింట్లతో నిలిచింది. దీంతో నాలుగో స్థానానికి మరింత చేరువైంది. అయితే, 116 పరుగులు స్వల్ప లక్ష్య ఛేదనను కూడా ఆ జట్టు చివరి వరకూ తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(kolkata knight riders morgan) తాము అనుకున్న దాని కన్నా ఈ వికెట్ చాలా నెమ్మదించిందని చెప్పాడు. సహజంగా దుబాయ్ పిచ్ పవర్‌ప్లేలో స్వింగ్ అవుతుందని, కానీ ఈ మ్యాచ్‌లో అలా జరగలేదని అన్నాడు.
"మేం బౌలింగ్, ఫీల్డింగ్‌లో మంచిగా రాణించాం. ఛేదనలో శుభ్‌మన్ (57) బాగా ఆడటమే కాకుండా ముందుండి నడింపించాడు. మరోవైపు మాకు బలమైన రిజర్వ్‌బెంచ్ ఉంది. అందులోంచి షకీబ్ ఉల్ హసన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం కష్టమైంది. కానీ అతడు మంచి ప్రభావం చూపాడు. అలాగే రెండో దశ యూఏఈలో ఉంటుందని మాకు తెలియదు. అయితే, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడి బాగా ఆడుతున్నాం. ఎలాగైనా విజయాలు సాధించాలనే కసితో ఉన్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మా ప్రణాళికలు కూడా ఆటపై మంచి ప్రభావం చూపుతున్నాయి. మా ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటూ మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. ప్రత్యేకించి ఈ స్లో పిచ్ పరిస్థితులకు అలవాటు పడటం చాలా సంతోషంగా ఉంది" అని మోర్గాన్ అన్నాడు.