తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఐపీఎల్​లో ఎక్కువ సంపాదించిన క్రికెటర్ ఎవరంటే? - ధోనీ ఐపీఎల్​ రెమ్యునరేషన్​

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​(Dhoni Retirement) ప్రకటించినా.. భారత మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీకి ఏ మాత్రం క్రేజ్​ తగ్గడం లేదు! అదే విధంగా తన బ్రాండ్​ వ్యాల్యూ తరగలేదు. ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్న మహీ.. ఐపీఎల్​(IPL 2021) టోర్నీ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన క్రికెటర్​గా ఘనత సాధించాడు. అతడి తర్వాత ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?

IPL 2021: Meet the top earning player of IPL and it's not Virat Kohli or Rohit Sharma
IPL 2021: ఐపీఎల్​లో అత్యధిక సంపాదన ఎవరిదంటే?

By

Published : Sep 19, 2021, 3:14 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(IPL 2021) రెండోదశ ఆదివారమే(సెప్టెంబరు 19) ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్​ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్ మధ్య జరగనుంది. ఈ లీగ్.. ఎంతోమంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం సహా ఆర్థికంగానూ వాళ్లను నిలదొక్కుకునేలా చేసింది. అయితే ఐపీఎల్​ చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారిలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(RCB Captain Virat Kohli) ముందున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్​ శర్మ కూడా అత్యధిక మొత్తం​ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ, ఐపీఎల్​ ద్వారా అత్యధికంగా ఆర్జించిన క్రికెటర్​ మాత్రం టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ! ఇప్పటివరకు 14 సీజన్లలో ఆడిన మహీ.. రూ.150 కోట్లకు మేర ఆర్జించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎంఎస్​ ధోనీ

ఐపీఎల్​ టోర్నీ ద్వారా చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ.. దాదాపుగా రూ.150 కోట్లు(Dhoni IPL Remuneration) ఆర్జించినట్లు సమాచారం. 2008 నుంచి 2021 వరకు జరిగిన సీజన్లలో ఈ మొత్తాన్ని ధోనీ అందుకున్నట్లు తెలుస్తోంది.

రోహిత్​ శర్మ

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ.. ఐపీఎల్​ సంపాదనలో(Rohit Sharma IPL Career) కోహ్లీతో పోలిస్తే కొంచెం ముందే ఉన్నాడు. దాదాపుగా రూ.146.6 కోట్లను(Rohit Sharma IPL Remuneration) ఐపీఎల్​ ద్వారా హిట్​మ్యాన్​ సంపాదించినట్లు తెలుస్తోంది.

విరాట్​ కోహ్లీ

ఐపీఎల్ అత్యధిక​ సంపాదన(Kohli IPL Remuneration) జాబితాలో మూడో బ్యాట్స్​మన్​ ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుత 14వ సీజన్​లో అత్యధికంగా రూ.17 కోట్లు పారితోషికం(Highest Paid Cricketer In IPL) అందుకుంటున్నాడు. అయితే ఐపీఎల్​ కెరీర్​ మొత్తంలో కోహ్లీ దాదాపుగా రూ.143.2 కోట్లను ఆర్జించాడు.

ఇదీ చూడండి..IPL 2021: రోహిత్ శర్మ పేరిట రికార్డులే రికార్డులు!

ABOUT THE AUTHOR

...view details