పంజాబ్ కింగ్స్ జట్టులోని విదేశీ బౌలర్ల పట్ల తానెంతో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు టీమ్ డైరెక్టర్ అనిల్ కుంబ్లే. ప్రపంచస్థాయి బౌలర్లతో తమ టీమ్ మరింత బలంగా మారిందని అభిప్రాయపడ్డాడు.
"రాజస్థాన్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లను నిలువరించడం మాకు అవసరం. గతేడాది విజయానికి చేరువగా వచ్చాం. ఈ ఏడాది కచ్చితంగా విజయంతో లీగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం. మా జట్టులో అత్యుత్తమ విదేశీ బౌలర్లు అయిన జే రిచర్డ్సన్, మెరిడిత్, క్రిస్ జోర్డాన్ వంటి వారున్నారు. ఈ బౌలర్ల చేరికతో జట్టు బలంగా కనిపిస్తుంది. దీని పట్ల సంతోషంగా ఉన్నాం."
- అనిల్ కుంబ్లే, పంజాబ్ కింగ్స్ డైరెక్టర్