తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 2021: పూర్తి షెడ్యూల్​ మీకోసం! - ఐపీఎల్ 2021 ఫుల్​ షెడ్యూల్

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్) ఈ నెల​ 9 (శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన లీగ్​ మ్యాచ్​లు, ప్లేఆఫ్స్​ల పూర్తి వివరాలతో కూడిన షెడ్యూల్​ను ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మీకోసం తెలుగులో అందిస్తోంది.

IPL 2021 full schedule in telugu news
ఐపీఎల్​ 2021 పూర్తి షెడ్యూల్​ తెలుగులో!

By

Published : Apr 8, 2021, 8:12 AM IST

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. గతేడాది యూఏఈలో జరిగిన ఈ లీగ్​ తిరిగి ఈ దఫా భారత్​లో జరగనుంది. ప్లే ఆఫ్స్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​లను కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రస్తుత సీజన్​ ఏప్రిల్​ 9న ప్రారంభమై మే 30న ముగియనుంది.​

చెన్నై వేదికగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరగనుంది. తొలుత నిర్ణయించినట్లుగా మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్​ల నిర్వహణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అహ్మదాబాద్​, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్​కతాలను వేదికలుగా నిర్ణయించింది. ఇందులో మొత్తం 56 లీగ్​ మ్యాచ్​లు జరగనున్నాయి. చెన్నై, ముంబయి, కోల్​కతా, బెంగళూరులలో పదేసి మ్యాచ్​ల చొప్పున జరుగుతాయి. మిగిలిన రెండు వేదికలలో 8 చొప్పున మ్యాచ్​లు నిర్వహిస్తారు. మ్యాచ్​ జరిగే వారం, తేదీ, వేదిక వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని ఈటీవీ భారత్​ మీకోసం అందిస్తోంది.

ఐపీఎల్​ 2021 షెడ్యూల్​
ఐపీఎల్​ 2021 షెడ్యూల్​

ఐపీఎల్ పాలక మండలి అన్ని జట్లకు తటస్థ వేదికలను ఇదివరకే ప్రకటించింది. దీంతో ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే అవకాశమే లేకుండా పోయింది. లీగ్​ మ్యాచ్​లను ప్రతి జట్టు నాలుగు వేదికలలో ఆడనున్నాయి.

ఇదీ చూడండి:ఐపీఎల్: హోమ్​ టీమ్​లో ఆడని క్రికెటర్లు!

ABOUT THE AUTHOR

...view details