చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది చెన్నై సూపర్ కింగ్స్. ఓటమితో నిరాశలో ఉన్న జట్టుపై మరో పిడుగు పడింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ జీతంలో కోత విధించారు. 12 లక్షల కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎల్: స్లో ఓవర్ రేట్.. ధోనీకి జరిమానా - ధోనీ దిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ జీతంలో కోత విధించారు అధికారులు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సరైన సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. కానీ దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ సమయంలో 18.4 ఓవర్లను మాత్రమే పూర్తి చేసింది ధోనీసేన. దీంతో కెప్టెన్ మహీపై ఫైన్ పడింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా (54) అర్ధశతకంతో మెరవగా సామ్ కరన్ (34), మొయిన్ అలీ (36) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా (72), శిఖర్ ధావన్ (85) మొదటి వికెట్‌కు 138 పరుగులు జోడించి విజయంలో కీలకపాత్ర పోషించారు.