చెన్నై వేదికగా హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్-పృథ్వీ జోడీ శుభారంభం అందించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
రాణించిన బౌలర్లు.. హైదరాబాద్ లక్ష్యం 160 - దిల్లీ vs హైదరాబాద్
చెపాక్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్ రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంత్ సేనకు మంచి ఆరంభం లభించింది. ధావన్-పృథ్వీ జంట తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా(39 బంతుల్లో 53 పరుగులు) మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ధావన్(26 బంతుల్లో 28 పరుగులు) వికెట్ తీసిన రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్కు తొలి వికెట్ అందించాడు. అనంతరం మరో మూడు పరుగుల తేడాతో పృథ్వీ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్(27 బంతుల్లో 37 పరుగులు) వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. స్టీవ్ స్మిత్(25 బంతుల్లో 34 పరుగులు) ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్నప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు.
TAGGED:
dc vs srh