తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన డివిలియర్స్​.. దిల్లీ లక్ష్యం 172 - దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

అహ్మదాబాద్ వేదికగా దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్​లో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్స్​మెన్లలో ​డివిలియర్స్ హాఫ్ సెంచరీతో మెరవగా..​ పటిదార్ ఫర్వాలేదనిపించాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్​, ఆవేశ్​ ఖాన్, అమిత్​ మిశ్రా, అక్షర్, రబాడా​ చెరో వికెట్ తీసుకున్నారు.

dc vs rcb match, virat kohli, rishabh pant
దిల్లీ vs బెంగళూరు, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్

By

Published : Apr 27, 2021, 9:09 PM IST

అహ్మదాబాద్​ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్​లో కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట్స్​మెన్లలో డివిలియర్స్ హాఫ్ సెంచరీతో​ రాణించాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టుకు శుభారంభం లభించింది. తొలి వికెట్​కు 30 పరుగులు జోడించింది ఓపెనింగ్​ జంట. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని ఆవేశ్​ ఖాన్ విడగొట్టాడు. కోహ్లీ రూపంలో దిల్లీకి తొలి వికెట్​ను అందించాడు. తర్వాతి బంతికే ఆర్సీబీకి మరో షాకిచ్చాడు ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ ఆడుతున్న ఇషాంత్​ శర్మ. ఓపెనర్​ పడిక్కల్​ను క్లీన్​ బౌల్డ్​ చేశాడు. ఆ తర్వాత బెంగళూరు రన్​రేట్ తగ్గిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్​వెల్​ వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.

నాలుగో వికెట్​గా క్రీజులోకి వచ్చిన డివిలియర్స్(42 బంతుల్లో 75 పరుగులు)​​.. రజత్​ పటిదార్​కు సహకరించాడు. ఆచితూచి ఆడుతూనే 54 పరుగుల భాగస్వామ్యం జోడించారు వీరిద్దరూ. కుదురుకుంటున్నట్లే కనిపించిన పటిదార్​(22 బంతుల్లో 31 పరుగులు)​ను అక్షర్​ బోల్తా కొట్టించాడు. చివర్లో డివిలియర్స్​ మెరుగ్గా ఆడాడు. దీంతో ఆర్సీబీ కాపాడుకోనే స్కోరు చేయగలిగింది.

ఇదీ చదవండి: ఐపీఎల్​ఆటగాళ్లకు క్రికెట్​ ఆస్ట్రేలియా హామీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details