చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే వేదికగా బుధవారం మ్యాచ్ జరగనుంది. మరి సీఎస్కే జోరుకు కేకేఆర్ అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి.
ఫుల్ జోష్‌లో సీఎస్కే..
ధోనీ నేతృత్వంలోని చెన్నై జ్టటు.. ఆడిన తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. మొదట్లో బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ, బౌలింగ్‌లో తేలిపోయింది. కానీ గత మ్యాచులో రాజస్థాన్‌పై సమష్టి ప్రదర్శనతో అద్భుతంగా ఆడింది. ఇదే జోరును కొనసాగిస్తే కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయం. అయితే ధోనీ బ్యాట్‌తో అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.