అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్‌ల్లో రాణించిన దిల్లీ ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ జట్టుకు ఓపెనర్లు తొలి వికెట్‌కు 23 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఈ జంటను తొలుత జేమీసన్ దెబ్బ కొట్టాడు. 6 రన్స్ చేసిన ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే స్టీవ్ స్మిత్‌ను సిరాజ్ పెవిలియన్ పంపాడు. గత మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన పృథ్వీ షా వికెట్‌ను హర్షల్ పటేల్ తీసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టోయినిస్.. కెప్టెన్ పంత్‌కు సహకరించాడు. ఈ జంట నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కుదురుకుంటుందనుకున్న సమయంలోనే దిల్లీని హర్షల్ పటేల్ మరోసారి దెబ్బకొట్టాడు. స్టోయినిస్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.